Mumbai Actress Harassment Case: బాలీవుడ్ నటిని తప్పుడు కేసులో అరెస్టు చేసి పోలీసులు ఇబ్బందులకు గురిచేసినట్లు వచ్చిన ఆరోపణలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిన నాటి బెజవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ స్రవంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, నాలుగు రోజుల్లో స్రవంతి రాయ్ నివేదిక ఇవ్వనున్నారు.
