Telangana Govt to Complete Devadula Soon : దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంపై, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టులో దాదాపు 91శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2025 డిసెంబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి చేసి, 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ దేవాదుల పంప్‌హౌస్ వద్ద నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు.