Surprise Me!

చిచ్చరపిడుగులా రగ్బీలో సత్తా చాటుతున్న తెలంగాణ అమ్మాయి - దేశానికి ప్రాతినిథ్యమే లక్ష్యంగా అడుగులు

2024-08-30 6 Dailymotion

Abhinaya Sri Rugby player : చిన్నతనం నుంచే ఆ యువతికి ఆటలపై ఎనలేని ఇష్టం. పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్నప్పటికీ తన లక్ష్యం మాత్రం వదల్లేదు. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టుకోకుండా ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ కఠోర సాధన చేస్తూ, పట్టణ యువతకే పరిమితమైన రగ్బీ ఆటలో తనదైన ముద్ర వేస్తోంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎక్కడ బరిలోకి దిగినా మైదానంలో మెరుపువేగంతో రగ్బీ ఆటలో సత్తా చాటుతోంది. అనేక క్రీడా పోటీల్లో శభాష్ అనిపించుకుని ప్రశంసలు అందుకున్న ఖమ్మం కు చెందిన యువ క్రీడాకారిణి అభినయశ్రీ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది.

Buy Now on CodeCanyon