Illegal Constructions in Gaganpahad : హైడ్రా హైదరాబాద్‌లోని ఆక్రమణదారుల భరతం పడుతోంది. చెరువుల్లోని ఆక్రమణలను ఏ మాత్రం నిర్మోహమాటం లేకుండా నేలమట్టం చేస్తోంది. తాజాగా రాజేంద్రనగర్ నియోజకవర్గం గగన్‌పహాడ్‌లోని అప్ప చెరువును ఆక్రమించి నిర్మించిన భారీ షెడ్లను కూల్చివేసింది. మైలార్దేవ్ పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి చెరువు ఎఫ్ టీఎల్‌ను ఆక్రమించి పదుల సంఖ్యలో షెడ్లను నిర్మించి పరిశ్రమలకు, గోదాములకు లీజుకు ఇచ్చారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన హైడ్రా ఈ ఉదయాన్నే అక్కడికి చేరుకొని అనధికారికంగా నిర్మించిన షెడ్లను ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది. అయితే యజమానులు చెరువు భూములను ఆక్రమిస్తే తాము ఏం పాపం చేశామని లీజుదారులు వాపోతున్నారు.<br />
