Heavy Rains in AP : ఏపీలోని విజయవాడ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అనేక కూడళ్లలో నీరు నిలిచి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రాంగణం జలమయమైంది. లోతట్టు కాలనీల్లో వరద పారుతోంది. బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు.
