Munneru Flood Victims Story : ఊహకందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు జల ఖడ్గం ఖమ్మం ముంపు ప్రాంతాల వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. నిద్ర లేచే సరికి ఉరుముకుంటూ తరుముకొచ్చిన వరద విలయం బాధితులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటెత్తిన మున్నేరు ముంపు ప్రాంత వాసుల్ని కకావికలం చేసింది. తరుముతున్న మున్నేరును చూసి గజగజ వణికిన బాధితులు ప్రాణాలు కాపాడుకునేందుకు బతుకు జీవుడా అంటూ మిద్దెపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నవారు మున్నేరు శాంతించడంతో ఇళ్లకు చేరుకున్నారు. ఆనవాళ్లు కోల్పోయిన గూడు, రూపురేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.<br />