Viral Fevers In Karimnagar : వాతావరణంలో మార్పులు, ఆవాసాలు శుభ్రం లేకపోవడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కరోనాతో పాటు డెంగీ జ్వరాల ఆందోళన ప్రజల్లో పెరిగింది. డెంగీ జ్వర నిర్ధారణ కేవలం ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే జరగాలన్న నిబంధనతో జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వందల సంఖ్యలో జ్వర పీడితులు ఆసుపత్రుల్లో చేరుతున్నా, ఔషధాల కొరత మాత్రం వెంటాడుతోంది. ఆస్పత్రిలో రాసే ప్రిస్క్రిప్షన్‌లో ఒకటి రెండు ఔషదాలు మాత్రమే ఉచితంగా ఇస్తూ, మిగతా వాటిని మాత్రం ప్రైవేట్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.<br />