Surprise Me!

కకావికలమైన మున్నేరు ప్రభావిత ప్రాంతాలు - ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు

2024-09-04 2 Dailymotion

Rescue Operation for Flood Victims : మున్నేరు విలయంతో కకావికలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని సర్కారు ముమ్మరం చేసింది. వరదల నుంచి తేరుకుంటున్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా యంత్రాంగాన్ని మోహరించింది. ప్రభావితమైన పది డివిజన్లలో ఒక్కోదానికి ప్రత్యేకాధికారిని కేటాయించింది. పారిశుధ్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్తు పునరుద్ధరణ, తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వీలైనంత త్వరగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేలా యంత్రాంగమంతా కార్య రంగంలోకి దిగింది.

Buy Now on CodeCanyon