Telangana Floods Effect : భారీ వరదలతో రాష్ట్రంలో కకావికమైన చోట సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై దృష్టి సారించింది. వరదలతో జరిగిన నష్టంపై అంచనాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పశుసంవర్ధక, మత్య్యశాఖలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి.
