Chandrababu Fires on Jagan : తాను పనిలేక వరదల్లో తిరుగుతున్నానన్న జగన్, ఏం ఎక్కువ పని ఉందని లండన్‌కు వెళ్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు. బుడమేరుకు గండ్లు పెట్టి ఇంతటి పరిస్థితికి కారణమైన దుర్మార్గుడు ఆయన అని మండిపడ్డారు. అరాచకాలు చేసే వైఎస్సార్సీపీ నాయకులను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. దుర్మార్గపు ఆలోచనలు చేసిన ఆ పార్టీ తీరును ప్రజలే ఎండగడుతున్నారని విమర్శించారు. మంచిని మంచి చెడును చెడు అని చెప్పగలిగితే రాష్ట్రంలో అరాచకాలు ఉండవని సీఎం ఆకాంక్షించారు.