AI Global Summit in Hyderabad 2024 : విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సిద్ధంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటైన రెండ్రోజుల అంతర్జాతీయ కృత్రిమ మేథ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం హైదరాబాద్‌లో ఏఐ సిటీ ఏర్పాటుతో కృత్రిమ మేథ భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని పేర్కొన్నారు.