CM Revanth Review on Power Department : రాష్ట్రంలో ఒక్క నిమిషం విద్యుత్ సరఫరాకి అంతరాయం ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాబోయే రోజుల్లో బిజినెస్ హబ్‌గా రాష్ట్రం మారబోతోందన్న ఆయన తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టంచేశారు. రైతులను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపుసెట్లు అందించాలని సూచించారు. అందుకు కొండారెడ్డిపల్లిని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
