Stock Market Fraud In Hyderabad : దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం కేసు దర్యాప్తును రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేగవంతం చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఉన్న సంబంధాలన్ని బహిర్గతమవుతున్నాయి. హైదరాబాద్ మదీనాగూడకు చెందిన విశ్రాంత ఉద్యోగి నుంచి కాజేసిన సొమ్మును ఎక్కడి తరలించారనే విషయమై కూపీ లాగుతున్న క్రమంలో పలు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ సమాచారాన్ని పోలీసులు ఈడీకి ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.
