BRS Leader Harish Rao Comments on Congress : రైతు సురేందర్ రెడ్డి మృతికి కారణం రుణమాఫీ కాకపోవడమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదనటం అవాస్తవమని తెలిపారు. రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడకు సురేందర్ రెడ్డి బలయ్యారని పేర్కొన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ 9 నెలల పాలనకు పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.<br /><br />ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 'మేము లిస్ట్ ఇచ్చినా ఒక్క రైతును కూడా ఆదుకోలేదు. రోజుకో మాటగా రేవంత్ పాలన సాగుతోంది. ఊసరవెల్లి కన్నా దారుణంగా రేవంత్ తీరు ఉంది. రుణమాఫీ చేసింది రూ.15 వేల కోట్లే. ఇది రైతులను మోసం చేయడం కాదా? మీ రాజకీయాల కోసం కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టారు. పింఛన్ రూ.2000 చేసి కుటుంబాలను బలోపేతం చేశారు కేసీఆర్' అని తెలిపారు.