VIP Aadi Srinivas Slams Harishrao : రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని, హరీశ్‌రావు దుఃఖంలో మునిగిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ అవుతుందన్న బెంగతో హరీశ్‌రావుకు కన్నీళ్లు ఆగడం లేదని ఆయన ఆరోపించారు. రైతులను రెచ్చగొట్టడమే హరీశ్‌రావు పనిగా మారిందని, రుణమాఫీపై విషప్రచారాలు చేయడం మానుకోవాలని తెలిపారు.
