Deputy CM Bhatti Vikramarka Review On Yadadri Power Plant : గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రాజెక్టుపై నిత్యం సమీక్షలు జరపకుండా పక్కన పెట్టడం వల్లే వ్యయం మరింత పెరిగి ప్రభుత్వంపైన ఆర్థిక భారం పడిందన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి వారం వారం క్యాలెండర్ ఖరారు చేశామని 2025 మార్చి 31 నాటికి ఐదు యూనిట్లు అందుబాటులోకి తీసుకువచ్చి 4,000 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు.
