Vegetable Prices Hike in Telangana : పదిహేను రోజుల క్రితం రూ.పది ఉన్న బెండకాయ ధర ఇప్పుడు ఏకంగా రూ.80కి చేరింది. రూ.20 ఉండే వంకాయ రూ.60కి, రూ.40 ఉన్న దొండకాయ రూ.80 పలుకుతోంది. భారీ వర్షాల వల్ల కూరగాయల పంటలు దెబ్బతినడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కాయగూరల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇంత ధర పెట్టి కూరగాయలు కొనే స్తోమత తమకు లేదంటూ వినియోగదారులు వాపోతున్నారు.<br />
