33 Percent BC Reservation in AP : చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత దస్త్రాన్ని నేడు రాష్ట్ర మంత్రివర్గం ముందుకు తీసుకురానుంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రత్యేక తీర్మానం చేసిన కేంద్రానికి పంపనున్నారు. అలాగే 26 జిల్లాల్లో బీసీ భవన్‌లతోపాటు 68 కాపు భవనాలు నిర్మించనున్నారు.