Yadadri Laddu Ghee Quality Checking in Hyderabad: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారడంతో ఇతర ఆలయాల్లో ప్రసాదాల కొనుగోలుకు భక్తులు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ప్రసాదం నాణ్యతపై ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లడ్డూలో వాడే నెయ్యిని హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే తయారీలో వినియోగిస్తామని తెలిపారు