Ganja Seized in Warangal : గంజాయి రవాణాతో పాటు సరఫరాదారులపై కఠిన చర్యలు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన సరకు పట్టుబడుతోంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దమొత్తంలో గంజాయి సాగయ్యేది, అయితే పోలీసుల నిఘా పెరగడంతో పండించడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం అలవరుచుకున్నారు.
