Surprise Me!

కేటీఆర్​ విషయంలో మాత్రం తగ్గేదే లే : మంత్రి సురేఖ

2024-10-03 8 Dailymotion

Minister Konda Surekha Explanation Comments on KTR : తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే అలా విమర్శించాల్సి వచ్చిందని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని అన్నారు. తన నుంచి అనుకోకుండా ఒక కుటుంబం (అక్కినేని కుటుంబం) పేరు వచ్చిందన్నారు. ఆ కుటుంబం ట్వీట్​ చూశాక తాను చాలా బాధపడ్డానని తెలిపారు. తాను బాధపడుతున్నట్లు ఇంకొకరు బాధపడొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని స్పష్టం చేశారు. హనుమకొండలోని ఆమె నివాసంలో మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు.<br /><br />ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, 'నేను పడిన బాధ, అవమానం ఇంకొకరిపై పడకూడదనే నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. కేటీఆర్​ విషయంలో తగ్గేది లేదు, ఆయన నాకు క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్​ చేసిందంతా చేసి, దొంగే దొంగ అని అరిచినట్లు ఉంది. కేటీఆర్​ లీగల్​ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తాం.' అని ఆమె స్పష్టం చేశారు.

Buy Now on CodeCanyon