Pawan Kalyan Varahi Declaration: ఇది ఎన్నికల సమయమో, సినిమా సమయమో కాదని, భగవంతుడి సమయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో జరిగిన వారాహి బహిరంగ సభలో డిక్లరేషన్ అంశాలను పవన్ వివరించారు. ఒక డిప్యూటీ సీఎంగానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగానో తాను ఇక్కడికి రాలేదని పేర్కొన్నారు. హిందువుగా, భారతీయుడిగా ఇక్కడికి వచ్చానన్నారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని తేల్చి చెప్పారు.