అక్టోబర్ 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో అమరావతి డ్రోన్ సమ్మిట్ -2024 ను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దానికన్నా ముందు విజయవాడలో హ్యాకథాన్‌ను కూడా నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డ్రోన్ సమ్మిట్ లోగో, వెబ్‌సైట్‌ను విజయవాడలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్‌కుమార్ ఆవిష్కరించారు. సదస్సుకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవుతారని తెలిపారు. డ్రోన్ కేపిటల్‌గా ఏపీ మారాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని చేరుకునే విధంగా సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.