Temporary Pause in Musi Residents Evacuation : మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేది లేదన్న సర్కార్ నిర్వాసితుల తరలింపు పనులకు తాత్కాలిక విరామిచ్చింది. పునరావాసం కింద బాధితులకు సమీపంలోని రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించి సుమారు 300 కుటుంబాలను అక్కడికి తరలించింది. ఇప్పటివరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారినే తరలించిన సర్కారు దసరా తర్వాత ప్రక్షాళనను మరింత వేగంవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొన్నిచోట్ల ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి ఇళ్లకి అధికారులు తాళాలు వేయగా మరికొన్నిచోట్ల ఇళ్లను కూలీల సాయంతో నేలమట్టం చేశారు.<br /><br />