Surprise Me!

రాష్ట్రంలో దసరా చేసుకునే పరిస్థితి లేదు : కేటీఆర్

2024-10-09 6 Dailymotion

BRS Leader KTR Fires on Congress Govt : రాష్ట్రంలో పండగ మాదిరి లేకుండా పోయిందని ఈసారి దసరా చేసుకునే పరిస్థితి లేకుండా భయానక వాతవరణం సృష్టించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మహ్మద్ అలాఉద్దీన్, పలువురు ఇతరులు తెలంగాణ భవన్​లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉంటే రైతుబంధు డబ్బులు వచ్చేవి, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చి ఉండేవని కేటీఆర్​ తెలిపారు. బతుకమ్మ ఆడుకునేందుకు లేకుండా డీజేలు కూడా బంద్​ చేశారని పేర్కొన్నారు.<br /><br />రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని కేటీఆర్​ ఆక్షేపించారు. ఒక డిసెంబరు 9 పోయి మళ్లీ డిసెంబరు 9 వస్తోందని రైతుల రుణాలన్నీ మాఫీ కాలేదని అన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రేవంత్​ రెడ్డి, రాహుల్​ గాంధీకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇస్తామన్నారు కానీ తులం ఇనుము కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. 1.70 కోటి మంది మహిళల్లో ఒక్కరికి కూడా రూ.2500 రాలేదని ధ్వజమెత్తారు.

Buy Now on CodeCanyon