CM Revanth On Integrated Residential Schools : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ దిశలో తాము గద్దెనెక్కగానే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం భూమిపూజ చేశారు. కులాలకు అతీతంగా అందరూ ఒకే చోటా చదువుకోవాలనే మహోన్నత ఆశయంతో ప్రభుత్వం సమీకృత గురుకులాలకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. 28చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు శంకుస్థాపనలు చేసినట్టు వివరించారు.
