Tirumala Brahmotsavam 2024 : అంగరంగ వైభవంగా సాగిన తిరుమల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 8 రోజులపాటు వివిధ వాహన సేవలపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ గతంలో కన్నా మిన్నగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి వాహనసేవలను తిలకించారు. అన్నప్రసాదం సహా తిరుమల లడ్డూలోనూ నాణ్యత పెరిగిందని భక్తులు అభిప్రాయపడినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.<br /><br />
