KCR Focus On BRS Party Activities : గులాబీ అధినేత కేసీఆర్ డిసెంబర్ నెలలో తన తదుపరి కార్యాచరణ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తనను కలుస్తున్న నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈ మేరకు సంకేతాలు ఇస్తున్నారు. వివిధ అంశాలు, ప్రజల సమస్యలపై పార్టీ తరపున ఇలాగే వినిపించాలని సమయం చూసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలన్న భావనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
