Surprise Me!

హైదరాబాద్ -​ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

2024-10-13 7 Dailymotion

Heavy Traffic in Hyderabad-Vijayawada National Highway : హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌లో భారీగా వాహనాల రద్దీ నెలకొంది. వందల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ వైపు వస్తుండటంతో రద్దీగా మారింది. దసరా పండుగను సొంతూర్లలో బంధుమిత్రులతో కలిసి జరుపుకున్న పలువురు సంబురాలు ముగియడంతో తిరుగు పయనమయ్యారు. సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, మంగళవారం నుంచి విద్యాలయాలు ప్రారంభం కానుండటంతో హైదరాబాద్‌కు చేరుకునేందుకు బయలుదేరారు. దీంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రద్దీకి అనుగుణంగా టోల్‌బూత్‌లను ఏర్పాటు చేశారు.

Buy Now on CodeCanyon