Surprise Me!

మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ

2024-10-16 0 Dailymotion

AP Cabinet Meeting : ఉచిత ఇసుక విధానం ఫిర్యాదులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరి తీరాలని ఆయన మంత్రులకు తేల్చి చెప్పారు. ఇసుకలో ఎమ్మెల్యేల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులు తేల్చేందుకే ఈ నెల 18న టీడీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. నార్కోటిక్స్ టాస్క్​ఫోర్స్​పై కూడా సీఎం, మంత్రులతో చర్చించారు. రౌడీ షీట్స్ తెరిచిన తరహాలో గంజాయ్ షీట్స్ తెరిస్తే బాగుంటుందని పలువురు అమాత్యులు ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించారు.

Buy Now on CodeCanyon