SRM University Experts said Amaravati Drone Summit 2024 Very Useful : డ్రోన్ల వినియోగాన్ని సరికొత్త రంగాలకు విస్తరించేందుకు డ్రోన్ సమ్మిట్ ఎంతగానో ఉపయోగపడనుందని అమరావతిలోని ఎస్ఆర్ఎం(SRM) విశ్వవిద్యాలయం నిపుణులు అభిప్రాయపడ్డారు. డ్రోన్ సమ్మిట్‌కు ఎస్.ఆర్.ఎం యూనివర్శిటి సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ సమ్మేళనం ద్వారా కలిగే ప్రయోజనాలను వర్శిటీ నిపుణులు ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు. మానవ జీవితాన్ని సరళతరం చేసేలా ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కునేలా డ్రోన్లు భవిష్యత్తులో క్రియాశీల పాత్ర పోషిస్తాయన్నారు. అలాగే డ్రోన్ల వినియోగం, విస్తరణ, పరిశోధనలకు సంబంధించి విధానాల రూపకల్పన జరగనుందని వెల్లడించారు. డ్రోన్ల వినియోగం పెంచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవడంపై నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.