Surprise Me!

సమాధుల వద్ద దీపావళి సంబురాలా - ఇదేక్కడి ఆచారం!

2024-11-01 8 Dailymotion

Diwali Celebrations at Thumbs : దీపావళి పండుగ రోజు ఎవరైనా లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఇంట్లో బాణాసంచా కాలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా శ్మశానంలో దీపావళి సంబురాలు జరుపుకుంటారు. ఇదేంటి? వెలుగులు విరజిమ్మే దీపావళి రోజు శ్మశానంలో సంబురాలు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అసలు ఆ వింత సాంప్రదాయం ఎక్కడ పాటిస్తున్నారు? అలా ఎందుకు చేస్తారో తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ స్టోరీ చదివేయండి.<br /><br />కరీంనగర్​లోని ఒక సామాజిక వర్గం సమాధుల వద్ద పూజలు చేసి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ వింత ఆచారం కరీంనగర్​లోని కర్మాన్​ఘాట్​లో దర్శనమిచ్చింది. చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వారి సమాధుల వద్ద తిను బండారాలను పెట్టి దీపాలు వెలిగిస్తారు. అనంతరం టపాసులు కాల్చి వేడుకలు చేసుకుంటారు. ఇలా ఈ ఆచారాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Buy Now on CodeCanyon