CM Chandrababu Naidu Restarts Amaravati Capital Works : రాజధాని పనుల పునఃప్రారంభానికి మరిన్ని సానుకూల అడుగులు పడుతున్నాయి. పాత టెండర్లు రద్దు చేసిన సీఆర్డీఏ (CRDA: Capital Region Development Authority) కొత్త టెండర్లకు మార్గం సుగమం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మధ్యలో ఆపేసిన నిర్మాణాల్ని పూర్తి చేయడమే ప్రథమ ప్రాధాన్యంగా త్వరలోనే ప్రజాప్రతినిధులు, అఖిలభారత సర్వీసు అధికారుల భవనాల పనులు పట్టాలెక్కనున్నాయి.