AP Assembly and Legislative Council Whips Finalized : ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను ప్రభుత్వం ప్రకటించింది. రికార్డు స్థాయిలో 20 మందికి అవకాశం కల్పించింది. శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధలను నియమించింది. ఉపసభాపతిగా రఘరామకృష్ణరాజు నియమితులు అయ్యారు.