Surprise Me!

అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదు

2024-11-14 2 Dailymotion

YS Sharmila Fires on YSRCP : జగన్‌ అరాచకాలు భరించలేక ప్రజలు ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరించి కూటమికి ఓట్లు వేశారని ఏపీ కాంగ్రెస్ అ‍ధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు 38 శాతం ఓట్‌ షేర్‌ పెట్టుకొని అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని ఎద్దేవా చేశారు. శాసనసభకు వెళ్లి ప్రజల తరఫున మైకుల ముందు మాట్లాడాలన్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఎంపికైన 11 మంది ప్రతిపక్షం కాకపోయినా ప్రజాపక్షం అనిపించుకోవాలని చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

Buy Now on CodeCanyon