Methanol Manufacture at Singareni : సింగరేణి సంస్థ మరో వినూత్న వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక ప్లాంటును సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆధారంగా ఏర్పాటు చేస్తోంది. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. ప్రయోగం సఫలమైతే భారీ ప్లాంట్‌ను నిర్మించేందుకు సంస్థ ఆలోచిస్తోంది.<br /><br />
