Adani bribe to YS Jagan Mohan Reddy: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సెకి నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తును తీసుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు తద్వారా ప్రజలపై 1.10 లక్షల కోట్లు అదనపు భారం పడనుంది. ఈ విషయం తెలిసినా జగన్ సర్కార్ పట్టించుకోకుండా ఒప్పందం విషయంలో ముందుకే వెళ్లింది. సెకి నుంచి ప్రతిపాదన వచ్చిన తరువాత రోజే, ఎటువంటి పరిశీలన లేకుండానే ప్రతిపాదనను మంత్రివర్గ ఆమోదానికి పెట్టింది. తర్వాత గుట్టుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై భారీ ఎత్తున ఆరోపణలు వచ్చినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. రైతుల మీద తనకే ప్రేమ ఉన్నట్లు, రానున్న 30 ఏళ్లపాటు అన్నదాతలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికే ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తుందంటూ తీయని మాటలు చెప్పుకొచ్చారు.
