Surprise Me!

మంత్రి కొండా సురేఖ మనసు కరిగిపోయింది - ఆ చిన్నారిని చూసి వెంటనే కారాపింది!

2024-11-26 1 Dailymotion

Minister Konda Surekha Purchase Footwear To a Child in Warangal : రాష్ట్రమంత్రి కొండా సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్‌ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండా సురేఖకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మార్కెట్‌ కూడలి రోడ్డుపై చెప్పులు లేకుండా తండ్రితో వెళ్తున్న ఒక పాపను చూసి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి, ఆ తల్లిదండ్రులను అడిగారు. 'తల్లి, తండ్రి ఇద్దరు ఉన్నారు, అయినా చిన్న పాపకి చెప్పులు లేకుండా ఎలా నడిపిస్తున్నారు. ఇంత ఎండగా ఉంది ఎలా తీసుకెళ్తున్నారు' అంటూ వారిని ప్రశ్నించి అక్కడే ఉన్న దుకాణం వద్దకు వారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా చెప్పులు కొని అందజేశారు. అంతే కాకుండా ఆ పసి పాపకు బట్టలు కూడా కొనిచ్చి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు.

Buy Now on CodeCanyon