Surprise Me!

YUVA: చూపులేని గాయకుడి పాటలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఫిదా

2024-11-28 9 Dailymotion

Palasa Singer Raju in RTC Bus : బస్సు ప్రయాణంలో ఆ యువకుడు పాడిన పాట ప్రస్తుతం తన జీవితాన్నే కొత్త మజిలీ వైపు నడిపిస్తోంది. ఆర్టీసీ బస్సులో తన పాట ఆ నోట ఈ నోట పాకి చివరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ని ఫిదా చేసింది. ఆయన ఎక్స్‌ ఖాతాలో వీడియో పోస్ట్‌ చేయడంతో అవకాశం తలుపు తట్టింది. సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పాట పాడే అవకాశం కల్పించింది. <br /><br />చేత్తో దరువేస్తూ హత్తుకునేలా పాడుతున్న తన పేరు రాజు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోని శంషాబాద్ స్వస్థలం. తల్లిదండ్రులు హనుమయ్య, సత్తెమ్మ. వారికి నలుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. నాలుగో సంతానమే రాజు. చూపు లేకుండా జన్మించాడు. తండ్రి మరణంతో తల్లే అన్నీతానై చూసుకుంటున్నారు. ఇంటి పైకప్పు కూలిపోవడంతో కుమార్తె స్వప్న ఇంట్లో ఉంటున్నారు.

Buy Now on CodeCanyon