Cyclone Fengal Update: పుదుచ్చేరి సమీపంలో ఫెయింజల్ తుపాను తీరం దాటింది. తీరం దాటినా కూడా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద భూభాగం మీదే కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ రానున్న 6 గంటలలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. దీని ప్రభావం వల్ల ఆదివారం, సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.