Surprise Me!

సంక్రాంతి తర్వాత అన్నదాతల ఖాతాల్లోకి సొమ్ము

2024-12-01 17 Dailymotion

CM Revanth Clarity On Rythu Bharosa : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికుబురు అందించింది. సంక్రాంతి తర్వాత రైతుభరోసా నిధులు జమచేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రూ. 16 వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్‌కు అందిస్తే, పదేళ్ల తర్వాత రూ.7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న సీఎం 2018 నుంచి 2023 వరకు ఐదేళ్లలో తీసుకున్న రుణాలన్నీ ఏకకాలంలో తీర్చినట్లు వివరించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతు ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి, సంక్రాంతి పండగకి రైతు భరోసా అమలు చేస్తామని గ్యారంటీ ఇస్తున్నాను అని వెల్లడించారు.

Buy Now on CodeCanyon