YOUTH COMMITS SUICIDE IN VISAKHA: లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేవలం 2 వేల రూపాయల కోసం లోన్‌యాప్ వేధింపులకు పాల్పడింది. చివరికి బాధితుడి భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి, బంధువులు, స్నేహితుల గ్రూపులకు పంపింది. దీంతో దీనిని తట్టుకోలేక మనస్తాపంతో విశాఖకు చెందిన నరేంద్ర అనే 21 ఏళ్ల యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.