Surprise Me!

ఈ నెల 13న స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్

2024-12-11 7 Dailymotion

CM Chandrababu on Swarnandhra Vision-2047 : ఈ నెల 13న విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జీఎస్డీపీ వృద్ధి దిశగా అంతా కలిసి కట్టుగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది నుంచి వృద్ధి రేటు రెండు అంకెల్లో ఉండాలని కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు హెల్దీ, వెల్దీ, హ్యాపీ అనే విధానాలకు అనుగుణంగా కలెక్టర్లు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. జీరో పావర్టీ లక్ష్యంగా ఆర్ధిక అసమానతలు తగ్గేలా ఎక్కడికక్కడ ప్రణాళికలు చేసుకోవాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు నదుల అనుసంధానంపై కూడా దృష్టి పెట్టాలని తేల్చి చెప్పారు. కలెక్టర్ల సమర్థతతోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు. జిల్లాల్లో కలెక్టర్లు పాలనలో చేసే మెరుగైన విధానాలు ఇతర చోట్ల కూడా అవలంబించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Buy Now on CodeCanyon