Lokesh Presentation in Collectors Conference: వాట్సప్ ద్వారా పౌరసేవలు అందించే అంశంపై కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేశ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక నుంచి వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జనన మరణ ధ్రువపత్రాల లాంటివి జారీ చేయటానికి అనుసరిస్తున్న విధానాన్ని రీఇంజనీరింగ్ చేయాల్సి ఉందన్నారు.