Surprise Me!

కాంగ్రెస్​ ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీలు పేదలకే అందుతున్నాయ్ : సీఎం రేవంత్ రెడ్డి

2024-12-14 2 Dailymotion

Doddi Komaraiah Kuruma Bhavan Inaugurate : కాంగ్రెస్​ ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీలు పేదలకే అందుతున్నాయని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. అమ్మలా ఉండే తెలంగాణ తల్లినే తెచ్చుకున్నామని అన్నారు.. ఆ విగ్రహం మన అమ్మకు, అక్కకు ప్రతిరూపమని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా కులగణన చేపడుతున్నామని వివరించారు. 98 శాతం కులగణన జరిగిందని వెల్లడించారు. హైదరాబాద్​లోని కోకాపేట్​లో కురుమ భవన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.<br /><br />ఈ సందర్భంగా కురుమల నిజాయితీని, గొప్పతనాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. కురుమలు అత్యంత నమ్మకస్తులని తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానని, ఊళ్లో భూమి అమ్ముకోవాలంటే ముందు కురుమలకు అమ్ముకోవాలని చెబుతుంటానని తెలిపారు. పార్లమెంటులో కూడ కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచుతామని చెప్పారు.

Buy Now on CodeCanyon