Ramoji Foundation Charity Works : ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా వార్తలను క్షణాల్లో అందించడమే కాదు ఆపదలో ఉన్న వారికి సైతం ఈనాడు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రామోజీ ఫాండేషన్ ద్వారా ఇప్పటికే వేలాది మంది అభాగ్యులకు గూడు దొరికింది. తాజాగా హనుమకొండలో మల్లికాంబ మనో వికాస కేంద్రంలోని చిన్నారులకు శాశ్వత ఆశ్రయాన్ని రామోజీ ఫౌండేషన్ కల్పించింది. సకల హంగులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ ప్రారంభించారు
