Surprise Me!

దక్షిణ కోస్తాంధ్రాకు భారీ వర్ష సూచన

2024-12-16 2 Dailymotion

Andhra Pradesh Weather Report : దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, మరింత బలపడుతూ తమిళనాడు వైపు కదులుతోంది. దీని ప్రభావం రాగల మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్రాలో ఒకటి రెండు చోట్ల భారీగా, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, బుధవారం  నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పశ్చిమగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది.

Buy Now on CodeCanyon