Surprise Me!

క్షమాపణలు చెప్పిన మంత్రి, ఎమ్మెల్యే

2024-12-16 1 Dailymotion

Minister Parthasarathy and MLA Sirisha Apologize: గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ ఇచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నిన్న గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జోగి రమేష్‌ను ఎవరు పిలిచారంటూ టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న పార్థసారథి, శిరీష వివరణ ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. విగ్రహావిష్కరణలో జోగి రమేష్‌ పాల్గొనడంపై తమ ప్రమేయం లేదని ఇరువురు క్షమాపణలు తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. <br />

Buy Now on CodeCanyon