Surprise Me!

'నేను ఏ తప్పు చేయలేదు భయపడేది లేదు - న్యాయపరంగా ఏం చేయాలో అది చేస్తాం : కేటీఆర్

2024-12-19 3 Dailymotion

KTR On Formula E racing case : రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలకు హబ్‌గా మార్చాలనే లక్ష్యంతోనే హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ నిర్వహించామని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీపీ) తనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్​ మాట్లాడారు. <br /><br />హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ కార్ రేస్ జరపాలని చాలా ప్రయత్నాలు జరిగాయన్న కేటీఆర్ 2001లోనే చంద్రబాబు ఫార్ములా-1 రేస్ నిర్వహించేందుకు యత్నించారని తెలిపారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఫార్ములా- ఈ కార్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కోరామని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల మధ్య చర్చ పెడదాం అని స్పీకర్‌ను కోరానన్న ఆయన ఫార్ములా- ఈ కార్ అంశంపై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

Buy Now on CodeCanyon