Surprise Me!

తిరుమలలోని పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం

2024-12-25 9 Dailymotion

Tirumala Parakamani Scam : తిరుమలలోని పరకామణిలో రూ.100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ బీఆర్ నాయుడికి వినతి పత్రాన్ని అందజేశారు. పరకామణిలో పెద్దజీయర్‌ తరఫున సీవీ రవికుమార్‌ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన రహస్యంగా దాదాపు రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని వివరించారు. సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్‌ ద్వారా శరీరంలో రహస్య అర కూడా పెట్టించుకున్నారని భానుప్రకాష్​రెడ్డి వెల్లడించారు.

Buy Now on CodeCanyon